MBNR: అనంతాపూర్ గ్రామంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాళోజీ సాహిత్యం, సామాజిక చైతన్యం యువతకు మార్గదర్శకమని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు


