హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

RR: షాద్‌నగర్‌లో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పంది వెంకట్ రాంరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.