MDK: తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాషా దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం అభినందనీయమని చెప్పారు.
తెలంగాణ
మెదక్‌లో కాళోజీ జయంతి వేడుకలు


