హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

WGL:పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాయపర్తి మండల శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మండల అధ్యక్షుడు నూనె అనిల్‌ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రూ.15 వేల కోట్ల బకాయిలతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ బకాయిలు విడుదల చేయాలని కోరారు.