హైదరాబాద్: 28°C
తెలంగాణ

తడ్కల్ పెద్ద చెరువుకు జలకళ

SRD: కంగ్టి మండలం తడ్కల్ శివారులోని పెద్ద చెరువు లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నిండుకుండలా జలకళను సంతరించుకుంది. ఏడాది వర్షాకాలం పుష్కలం కావడంతో భారీ స్థాయిలో వరద నీరు చేరింది. అయితే చెరువు కింద దాదాపు 113.31 ఎకరాల్లో రైతులు వరి పంటలు సాగు చేస్తున్నారు. పచ్చని పైరుతో వరి పంట కళకళలాడుతోంది. ఆశించినంత మేర వరి దిగుబడులు వస్తాయని రైతులు తెలిపారు.