HYD: ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రధాన రహదారులపైనే అడ్డగోలుగా నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటలకు KPHB, కూకట్‌పల్లి, లక్డీకాపూల్, పంజాగుట్ట సిగ్నల్ వద్ద బస్సులు ఆపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటిని కట్టడి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లపైనే అడ్డగోలుగా బస్సుల నిలిపివేత


