హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు!

WNP: రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు నుంచి సదరు వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ యశోద క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు.