SRPT: బొజ్జగూడెం తండ గ్రామంలో సర్పంచ్ గుగులోతు నీలాబాయి ఆధ్వర్యంలో ఇవాళ పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. రోడ్ల వెంట పెరిగిన పిచ్చి చెట్లను సైతం కొట్టివేసి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు.
తెలంగాణ
పచ్చదనం–పరిశుభ్రతకు ప్రాధాన్యం


