హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

WGL: తెలంగాణ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి కొండా సురేఖ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కాళోజీ.. తన కవిత్వం ద్వారా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో రగిలించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ భాషా సంస్కృతికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.