BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక బుధవారం కన్నుల పండువగా సాగింది. మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు క్రతువును వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవాలయం రామనామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాములు వారి నిత్య కళ్యాణం


