KMM: రఘునాథపాలెం మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటలాడుతుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ (14) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బాలుడు స్వస్థలం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి అని ఉపాధ్యాయులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
తెలంగాణ
గుండెపోటుతో బాలుడు మృతి


