హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి!

NZB: నవీపేట్ మండలం యంచ రైల్వే బ్రిడ్జిపై బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి ఆచూకీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.