హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పత్తి పంటకు తెగుళ్ల ముప్పు

ఆసిఫాబాద్ జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రాత్రివేళ చల్లని వాతావరణం, ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పంట పొలాల్లో తేమ శాతం పెరుగుతోంది. దీంతో పత్తిలో వివిధ తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.