హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నెల్లూరులో నీటి సరఫరా బంద్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని రిత్విక్ సెక్షన్ వద్ద 500 మిమీ డీఐ పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం, 10వ తేదీ ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. దీంతో ఏకే నగర్, కనుపర్తిపాడు, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.