MBNR: పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని DM&HO శ్రీనివాసులు అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాత పాలమూరు, ఎస్‌ఎస్ గుట్ట ప్రాంతాల్లో డెంగీ బాధితుల ఇళ్లను పరిశీలించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరాల్లో వారం రోజులపాటు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. నీరు నిలిస్తే దోమల వ్యాప్తి పెరిగి డెంగ్యూ ముప్పు అధికమవుతుందని తెలిపారు.
తెలంగాణ
పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత: DM&HO


