MBNR: చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి యువత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ


