హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై

SRD: గణేష్ మండపం ఏర్పాటు చేసే ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సిర్గాపూర్ ఎస్సై మహేష్ తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు, సభ్యులు నిబంధనలు పాటించి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. మండపాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్‌కు అనుమతి లేదని, ప్రశాంతంగా నిమజ్జన యాత్ర నిర్వహించాలని కోరారు.