హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనుమాముల మార్కెట్‌కు వరుస సెలవులు

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వరుసగా నాలుగు రోజులు బంద్ ఉండనుంది. ఈనెల 11 (శుక్రవారం) అమావాస్య, 12, 13 తేదీల్లో వారాంతపు సెలవులు, 14(సోమవారం) వినాయక చతుర్థి సందర్బంగా మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ నాలుగు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచించారు.