హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడు మృతి.. మాజీ MLA నివాళి

BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామ వాస్తవ్యులు మోలుగురి రాజు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈరోజు ఉదయమే వారి ఇంటికి వెళ్ళి రాజు పార్దీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.