హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం!

NLG: దేవరకొండలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గాజుల అభినవ్ రాజ్(25) నిన్న బైక్‌పై మహబూబ్‌నగర్ రోడ్డులో యూటర్న్ తీసుకుంటుండగా డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.