హైదరాబాద్: 28°C
క్రీడలు

'రో-కో భాగస్వామ్యంపై స్పష్టత లేదు'

2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భాగస్వామ్యంపై స్పష్టత లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. వారి భవిష్యత్తుపై తుది నిర్ణయం సెలెక్టర్లదేనని పేర్కొన్నాడు. అయితే వారిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.