హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్లో 32 అడుగుల భారీ మట్టి వినాయకుడి విగ్రహం

KNR: కరీంనగర్ రాంనగర్ డ్యాం రోడ్డులో 32 అడుగుల భారీ మట్టి వినాయకుడి విగ్రహాన్ని మిత్ర యూత్ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేస్తున్న ఈ మట్టి గణనాథుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులు మట్టి విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడాలని యూత్ సభ్యులు పిలుపునిచ్చారు.