హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టులకు భారీగా దరఖాస్తులు

భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 41 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు 881 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిణి మల్లీశ్వరి మంగళవారం తెలిపారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 12 పోస్టులకు 277,మహదేవపూర్ ప్రాజెక్టులో 29 పోస్టులకు 604 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, త్వరలో ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేపడతామని వెల్లడించారు.