హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దనపల్లి, నాయకపుగూడ గ్రామల శివారులో చిరుతపులి సంచారం?

MNCL: కాసిపేట్ మండలంలోని పెద్దనపల్లి, నాయకపుగూడ గ్రామల శివారు చెరువు సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. చెరువు పరిసర ప్రాంతంలో చిరుతపులి కనిపించినట్లు మేకలు కాస్తున్న ఇద్దరు మేకల కాపరులు తెలిపారు. చెరువు పరిసరాల్లో చిరుత జాడలున్నాయా అనే విషయాన్ని పరిశీలించి అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.