హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోదావరి ఒడ్డున జింకల విహారం

NZB: నవీపేట్ మండలం నాలేశ్వర్‌లో గోదావరి ఒడ్డున జింకలు సందడి చేశాయి. పొలం పక్కన గోదావరి పరీవాహక ప్రాంతంలో జింకలు గుంపుగా సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. పచ్చని పంట పొలాల మధ్య జింకలు స్వేచ్ఛగా పరుగులు తీస్తూ విహరించడం చూపరులను ఆకట్టుకుంది. కొందరు స్థానికులు జింకల దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.