హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెల్త్ సబ్‌ సెంటర్ ఏర్పాటుకు.. మంత్రికి వినతి

BDK: ములకలపల్లి మండలం చాటిగూడెం గ్రామంలో హెల్త్ సబ్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. గ్రామీణ,గిరిజన ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు సబ్‌ సెంటర్ అవసరమని అన్నారు. ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.