హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో పోలీసుల అవగాహన సదస్సు

MDK: హవేలిఘనపూర్ పరిధిలోని రాజపేట జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాటలు, నాటికల ద్వారా విద్యార్థులకు సైబర్ మోసాలు, డ్రగ్స్ నిర్మూలన, ప్రాథమిక చట్టాలపై సులభంగా వివరించారు. అవగాహనతోనే సురక్షిత సమాజం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు.