KMM: బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన తోట రామాంజనేయులు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచే సీపీఐలో పనిచేస్తూ పలు బాధ్యతలు నిర్వహించారు. కార్మికులు, ప్రజా సమస్యలపై పోరాటాల్లో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్రస్థాయి పదవికి ఎన్నిక కావడంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం అన్ని వర్గాల ప్రజలు సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామాంజనేయులు


