హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం చేరుకున్న ఎస్టీ కమిషన్ చైర్మన్

ATP: ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోల్ల బొజ్జిరెడ్డి జిల్లా పర్యటన నిమిత్తం అనంతపురం చేరుకున్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆర్డీవో ప్రేమ్‌నాథ్ కుమార్, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు ఆయనకు పూలగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. బుధవారం ఏకలవ్య విగ్రహానికి నివాళులర్పించి, పామిడి మండలం పాలెం తండాలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.