హైదరాబాద్: 28°C
వార్తలు

మెగా వాహన తనిఖీలు చేపట్టిన ఎస్పీ

విజయనగరంలో ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధరించకపోతే జరిగే నష్టాలను వాహనదారులకు వివరించి, తప్పనిసరిగా రూల్స్ పాటించాలని కోరారు. ఈ తనిఖీల్లో సుమారు 800 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.