WGL: ఖానాపూర్‌లో నెల రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని సర్పంచుల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకు 8 నుంచి 10 గంటలపాటు కోతలతో రైతులు పంటలకు నీరందించలేకపోతున్నారని పేర్కొన్నారు. రాత్రివేళ విద్యుత్ లేక విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని తెలిపారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
కరెంటు కోతలతో అవస్థలు


