హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పెనుగొండలో పర్యటించనున్న ఎమ్మెల్యే

W.G: 'కూటమి ప్రభుత్వం-రెండేళ్ల అభివృద్ధి' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం పెనుగొండలో పర్యటించనున్నారు. కాలేజ్ వంతెన వద్ద రామచంద్రరావుపేట నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు స్వయంగా వివరించనున్నారు.