హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేపల మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డులో రూ.35.90 లక్షలతో ఆధునీకరించిన చేపల మార్కెట్‌ను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. మత్స్యకార మహిళల సమస్యలను గుర్తించి, త్వరితగతిన పనులు పూర్తి చేయించడంతో వారు ఆయనకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.