హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి ఉత్సవాలకు సహకరించాలి'

అనకాపల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు సహకరించాలని కోరుతూ ఏపీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మంగళవారం ఎస్పీ తుహీన్ సిన్హాకు వినతిపత్రం అందజేశారు. మండపాలు, అణుపు మహోత్సవాలు, నిమజ్జనాల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కల్పించాలని కోరారు. శారదానది ఘాట్, తుమ్మపాల, కొప్పాక, ఏలేరు కాలువల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.