హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్

E.G: రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ (బాక్స్ ప్రసాద్) బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కంబాల చెరువు వద్ద నిర్వహించిన జెండాల పండుగ కార్యక్రమం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ వీర్రాజు సాధరంగా ఆహ్వానించారు.