హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు ఆంజన్న సేవలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని హైడ్రా కమిషనర్, ఐపీఎస్ రంగనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు.