హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగులంతా సంఘాలకు అతీతంగా ఏకంకావాలి:TGEJAC

MHBD: TGE JAC పిలుపు మేరకు గంగారం మండలంలో మంగళవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ ఉద్యోగుల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులంతా సంఘాలకు అతీతంగా తరలిరావాలన్నారు.