హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్దనూరు వద్ద బస్సు ప్రమాదం

KDP: ముద్దనూరు రోడ్డులోని చిత్రలేఖ రెస్టారెంట్ వద్ద కర్ణాటక బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన బస్సు నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.