హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివరామపురంలో అంధకారం

కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ శివారు శివరామపురంలో నెలల తరబడి వీధి దీపాలు వెలగడం లేదు. ప్రత్యేక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట రహదారులపై విషసర్పాల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి దీపాలు వెలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.