హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రాయిగూడలో వైభవంగా శివపార్వతుల పల్లకి ఊరేగింపు

ADB: సిరికొండ మండలంలోని రాయిగూడ గ్రామంలో శివపార్వతుల పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నెలరోజుల పాటు శివ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆధ్యాత్మికవేత్త మిట్టపల్లి శంకరయ్య తెలిపారు. భజన సంకీర్తన కార్యక్రమంతో కొనసాగిన ఊరేగింపుతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.