హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

MDK: తూప్రాన్ మండలంలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్ పనుల దృష్ట్యా ఇస్లాంపూర్, మల్కాపూర్, వెంకటాయపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.