ASR: అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీలో మంగళవారం 265 మంది రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారు. 90% రాయితీతో రాజ్మా విత్తనాలు అందించినట్లు అధికారులు తెలిపారు. విత్తనాల కొరకు రైతులు ఆధార్, పోడు పట్టా జిరాక్స్, ఫోన్ నెంబర్‌తో స్వర్ణగ్రామ కార్యాలయాన్ని సంప్రదించాలని విహెచ్ఏ దశరధ్ సూచించారు. ఈ కార్యక్రమంలో విఏఏ భాను శరణ్య, విహెచ్ఏ పుణ్యావతి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు రాజ్మా పంపిణీ


