PDPL జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ఇద్దరికీ కష్టమైన ఆర్థోపెడిక్ ఆపరేషన్లు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. తురకల మద్దికుంటకు చెందిన యువకునికి మోచేతికి ఆపరేషన్ చేయగా, బంగారం గ్రామానికి చెందిన మహిళకు కుడికాలు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణ
క్లిష్టమైన ఆర్థోపెడిక్ ఆపరేషన్లు నిర్వహణ


