హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్!

HYD: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటింగ్‌లో తీర్మానం నెగ్గడంతో ఇద్దరినీ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.