హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఆగ్రహం

JN: జనగామ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఛైర్‌పర్సన్, కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి ప్రతిగా ఛైర్‌పర్సన్‌కు పరిపాలన చేయడం రావట్లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పాలన గాడి తప్పిందని, ప్రజా సమస్యలను పట్టించూకోవడం లేదని ఆరోపించారు.