హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పిపోయిన బాలిక ఆచూకీ లభ్యం

MDK: నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన మతిస్థిమితం లేని బాలిక 11 ఏళ్ల క్రితం తప్పిపోగా, మెదక్ బేతాని ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. ఆధార్ కార్డ్ నమోదు ప్రక్రియ ద్వారా తల్లిదండ్రుల ఆచూకీ కనుగొని వారికి అప్పగించినట్లు DWO హేమభార్గవి తెలిపారు. ఆధార్ నంబర్ ఆధారంగా బిడ్డను అప్పగించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ సిబ్బంది పాల్గొన్నారు.