NRML: బాసర ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై కలెక్టర్ భవేష్ మిశ్రా ఆధ్వర్యంలో ఐడీఓసీలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో SP జానకి షర్మిల, అధికారులు పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సీసీ కెమెరాలు, రద్దీ నిర్వహణపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
బాసర పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం


