హైదరాబాద్: 28°C
క్రీడలు

పోరాడుతున్న తిలక్‌ వర్మ

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో పడింది. ఈస్ట్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించగా, సౌత్ జోన్ మూడో రోజు ఆట ముగిసేసరికి 242/6తో 466 పరుగులు వెనుకబడి ఉంది. జట్టును ఆదుకునేందుకు కెప్టెన్ తిలక్ వర్మ 56 పరుగులతో పోరాడుతుండగా, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.