హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌కు షాకిచ్చిన అఫ్గాన్ క్రికెట్ బోర్డ్

భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రచార వీడియో రూపొందించింది. ఇందులో పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్-బల్టిస్థాన్‌లను భారత్‌లో భాగంగా చూపించింది. దీనిపై పాకిస్తాన్ విదేశాంగశాఖ వద్ద పాక్ క్రికెట్ బోర్డు  ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. సరిహద్దు ఘర్షణలతో అఫ్గాన్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న తరుణంలో ఈ వివాదం తలెత్తింది.