హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలి: AO

MDK: రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను పారదర్శకంగా నమోదు చేసేందుకు చేపట్టిన డిజిటల్ సర్వేకు రైతులు పూర్తి సహకారం అందించాలని హవేలీ ఘనపూర్ AO బాల్‌రెడ్డి కోరారు. తోగిట గ్రామంలో జరుగుతున్న సర్వే తీరును ఆయన పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ సాగు వివరాలను సక్రమంగా అందించి నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.